Header Banner

ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన కరోనా.. ఈరోజు మరో పాజిటివ్ కేసు నమోదు! రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు.!

  Fri May 23, 2025 14:30        India

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా కడప జిల్లాలో ఓ వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై, ప్రజలకు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు తీవ్ర జ్వరంతో బాధపడుతూ కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో చేరారు. అక్కడ వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని వస్తున్న నివేదికల నేపథ్యంలో, ప్రజారోగ్యం దృష్ట్యా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

 

ఇది కూడా చదవండి: కడప మహానాడులో లోకేష్ మార్క్! నా తెలుగు కుటుంబం - 6 అంశాలతో పార్టీకి కొత్త లుక్!

 

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రార్థనా సమావేశాలు, సామాజిక సమావేశాలు, వేడుకలు, పార్టీలు, ఇతర సామూహిక కార్యక్రమాలను వీలైనంతవరకు వాయిదా వేసుకోవడం మంచిదని సూచించింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు వంటి రద్దీ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా కొవిడ్  నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా జనం ఎక్కువగా ఉండే చోట మాస్కులు ధరించడం తప్పనిసరి అని పేర్కొంది. జ్వరం, చలి, దగ్గు, తీవ్రమైన అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన తెలియకపోవడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ముక్కు కారడం లేదా దిబ్బడ వేయడం, వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటలూ పనిచేసే ల్యాబ్‌లను సిద్ధంగా ఉంచాలని, అవసరమైన టెస్టింగ్ కిట్లు, మాస్కులు, పీపీఈ కిట్లు, ట్రిపుల్ లేయర్ మాస్కులను తగినంత నిల్వ ఉంచుకోవాలని వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రజలందరూ సహకరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, ప్రభుత్వ సూచనలను తప్పక పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ కోరింది.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. కొత్తగా కేబుల్ బ్రిడ్జ్! రూట్ లోనే ఫిక్స్ - నేషనల్ హైవేకు దగ్గరగా.!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #CoronaVirus #XECVariant #Germany #Europe